Ounu, Naaku Nachaledu!|ఔను, నాకు నచ్చలేదు!
- Author:
- Pages: 196
- Year: 10 August 2025
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹225.00
“అసలు ఏంటి నీ మొండిపట్టు? నాకు ఆ ఉగ్గు పెట్టటం అవన్నీ వస్తాయా?
డయపర్ అంటే సరే మారుస్తా కానీ... ఈ పాలు పట్టటం, ఫ్రిజ్లో పెట్టటం...
ఇవన్నీ ఏంటి? అంత అవసరమా?”
“నాకు కూడా పాపాయి పుట్టగానే అవన్నీ రాలేదు ఆదిత్యా...
అన్నీ స్ట్రగుల్ అవుతూనే నేర్చుకున్నాను...”
పెళ్ళి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ప్రాధాన్యాలన్నీ మారిపోయి, సిటీలో ఉండటమే ప్రధానమైపోయి, ఏళ్ళు గడిచిపోయాయి. గోపాల్ ఎన్నిసార్లు ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు తీసుకుని బయట ఊళ్ళు తిరిగివచ్చినా నేను మాత్రం అలా ఉండిపోయాను.
“కరుణించు మేరిమాతా... శరణింక మేరిమాత...” 'మిస్సమ్మ'లో సావిత్రి గుర్తొచ్చింది. కరుణించు మేరిమాతా... కాదు, నిద్రమాతా... కానీ మాతకి కరుణ లేదు,
మీరు కాల్ చేసిన దేవత ప్రస్తుతం స్పందించుట లేదు.
పాపికొండల్లో ఆ పరవళ్ళు తొక్కుతున్న గోదావరిపైన వినపడుతున్నది కొండగాలి గుసగుసలో, తేటనీటి గలగలలో, సేదతీర్చే పిల్లగాలి పాటలో, గిరిజనుల పల్లె పదాలో కాదు, చెవులు పగిలిపోయేట్టు స్పీకర్ల నుండి వస్తున్న బూతు పాటలు.
“నేనదే అంటున్నాను ఆంటీ, నాకేం తక్కువ? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ
నా బ్రతుకు నేను బ్రతుకుతాను. నన్ను నన్నుగా చేస్కునేవాడు దొరక్కపోడు”
తలెత్తి ధీమాగా అంటున్న నేహా నాకు నవతరం ప్రతినిధిలా కనిపించింది.
ఇల్లంతా నిండిపోయిన ఆ సామాన్ల మధ్య కూర్చుని టీ తాగుతూ యుద్ధభూమిలో
అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడిలాగా మోహనకి అరగంట క్లాస్ పీకాను.
“జనం దగ్గర డబ్బు పెరిగిపోయింది. దానితోపాటే వస్తు వినియోగం.
అడక్కముందే ఇచ్చే అప్పులు, ఆస్తులకై వెంపర్లాటని పెంచాయి.
లేని అంతస్తునూ అబద్ధపు ఆడంబరాలనూ తెచ్చిపెట్టాయి.”
Tags: Ounu, Naaku Nachaledu!, ఔను, నాకు నచ్చలేదు!, సింగరాజు రమాదేవి, 978-9393056634, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ