Anukonidi | అనుకోనిది

Anukonidi | అనుకోనిది

  • ₹200.00

అనుకోనిది - కె.వి.యస్. వర్మ కథలు

“ఆడదైతే మాత్రం ఇష్టాలూ అయిష్టాలూ వుండకూడదా..? అన్నయ్య కాలేజీలో చదువుతున్నాడు కదా. నేనూ వాడితోపాటు వెళ్లి చదువుకుంటాను.”

“వాడు మగోడు. వాడితో సమానంగా నువ్వూ తగుదునంటే ఎలా? వాడు సైకిలు మీద కాలేజీకెళ్లి వస్తున్నాడు. నువ్వెలాగ వెళ్తావు?”

*****

“నువ్వు చెప్పింది విన్నాక జీవితం కంటే సిద్ధాంతమే

ముఖ్యమైనదని అనిపిస్తోంది” అన్నాడు వీరభద్రం.

“అదెలా కుదురుతుందది. సిద్ధాంతమే ముఖ్యమైనప్పుడు 

జీవితాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు కదా” అన్నాడు నరసింహమూర్తి.

*****

“ఈ డబ్బులేం చేస్తావు?”

“తాతయ్యా, మీరు మర్చిపోయినట్టున్నారు. ఫుట్ బాల్ నేనే కొనుక్కుంటానన్నాను కదా...”

"మిగతా డబ్బులు నేనిస్తాలే” అన్నాను.

“వద్దులెండి. మరో పంట వచ్చాక నేనే కొనుక్కుంటాను” అన్నాడు.

*****

చాలా రోజుల తర్వాత, రోజులేనా? కాదు, నెలల తర్వాత మూర్తిగారు వచ్చారు.

నా ముఖంలో దాచుకోలేనంత ఆనందం కనిపించినట్టుంది, మా విజయ వదిన వేళాకోళమాడింది. “ఇంక మా మరదలు కొన్నాళ్లు స్వర్గంలో తేలిపోతుంది.

మేం అసలు కనిపించం” అంది నవ్వుతూ.

*****

సుధీర పగలబడి నవ్వుతూ, “నానమ్మా, రాత్రి నాకే కలా రాలేదు. అతను నిద్రపోయే వరకూ మెలకువగా వుండి, కల వచ్చినట్టు ధైర్యంగా నటించాను” అని చెప్పింది.

“నువ్వు కలలరాణివే అనుకున్నాను ఇన్నాళ్లూ. వగలరాణివి కూడానన్న మాట”

అంది నవ్వుతూ నానమ్మ.

*****

ఎప్పుడూ వుండే దేవుడి పటం స్థానంలో తన ఫొటో!

“నర్మదా, ఏంటిది? నీకేమన్నా పిచ్చా...” అన్నాడు సుదర్శన్.

తలూపుతూ “ఎవరి పిచ్చి వారికి ఆనందం” అంది ప్రశాంతంగా వున్న మొహంతో.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Anukonidi, అనుకోనిది, కె.వి.యస్. వర్మ, KVS Varma, 9789393056665, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ