Alavaataipotunna...|అలవాటైపోతున్న...

Alavaataipotunna...|అలవాటైపోతున్న...

  • ₹280.00

అలవాటైపోతున్న... అనే మాట గత 40 సంవత్సరాలుగా నా మస్తిష్కంలో అలజడి రేపుతూనే ఉంది. ఇది నాకెంతో ఇష్టమైన కథా రచయిత వి. రాజా రామమోహన రావు అనే రాజా రాసిన కథ పేరు. రాజా కథలన్నీ మనకు తెలియని జీవితాలను ఆవిష్కరిస్తూ, అందులోని చీకటి కోణాలను అన్వేషిస్తూ పాఠకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. అలాగే మనకు తెలిసిన జీవితాల్లోనే తెలియని అంతఃసంఘర్షణలను మనముందు పరిచి మన ఆలోచనలకు పదును పెడతాయి. ఈ కథలు చదివితే మనిషి జీవితం లోని అనేక పార్శ్వాలు, వాటికున్న వివిధ కోణాలు మనకు బోధపడతాయి. జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ఈ కథలు చదవటం అవసరం. ఈ కథలకు అంత శక్తి ఉంది... అందువల్లనే ఆయన రాసిన అలవాటైపోతున్న... కథ 40 ఏళ్ళుగా నన్ను వెంటాడుతూనే ఉంది. -----వాసిరెడ్డి నవీన్

  • “ఎన్నో రిసోర్సెస్‌ వున్న ఈ దేశం యిలా ఎందుకుండాలి? సత్యంగా సజావుగా ఎందుకుండకూడదూ! నా అపసవ్యానికి అదే కారణమేమో...”
  • రెండు నెలలు కూడబెట్టుకున్న డబ్బు, తన సుఖం, తన శరీరం అన్నింటినీ పణంగా పెట్టినా... పక్కన కొడుకుని, కొడుకు చేరువని సాధించుకున్నందుకు చిత్రమైన గర్వం అనిపించింది మల్లమ్మకి.
  • ఆ పుస్తకం పేరు చూడగానే నవ్వొచ్చింది గోపాలకృష్ణకి. ‘ఎగ్జిక్యూటివ్‌! నిన్ను నువ్వే చంపుకుంటున్నావా?’ అని అలవాటు ప్రకారం తెలుగులోకి అనువాదం చేసింది అతని బుర్ర ఇంగ్లీషులో వున్న ఆ పేరుని.
  • తన మనసుని అప్పటివరకూ పట్టుకుని పీడించిన దరిద్రం గురించి యింక వసంతకి చెప్పాలనిపించలేదు రాఘవరావుకి. స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు పరస్పరం పంచుకోవాల్సిన తృప్తి వేరే వుందనిపించింది.
  • సుశీల వొంటరి ఆడది... బతుకుతోంది... చుట్టూ వున్న కుళ్ళూ, దరిద్రం తెలిసీ జీవితంలో నడుస్తోంది. తలుచుకుంటే తనూ నడవలేడా... నడుస్తూ ధైర్యాన్ని ‘పెంచుకోలేడా...’

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Alavaataipotunna, అలవాటైపోతున్న, వి. రాజా రామమోహనరావు కథలు-3, 9789393056498, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ