Agarudoopam|అగరుదూపం

Agarudoopam|అగరుదూపం

  • ₹200.00

“వానలు పడటానికి దేవతలు కారణం కాదు, పర్వతాలు.

దేవతాపూజ మాని, గోవర్ధనపర్వతాన్ని పూజించండి అని చెప్పిన

హేతువాదిని, పర్యావరణ ప్రేమికుణ్ణి కృష్ణునిలో దర్శిస్తున్నాను.”

***

గాథాసప్తశతి గురించి అప్పటికీ యిప్పటికీ ఒక్కటే భావన. అది మిన్నుల పడిన చోటుల గురించి చెప్పదు. కంటికి కనబడని దేవతల గురించి చెప్పదు. అనవసరమైనచోట

నీతులను చెప్పదు. అవసరమైనచోట చెప్పకుండా ఉండదు.

మానవసహజ వాంఛలను, ఉద్వేగాలను, ప్రేమను, నిరసనను చెబుతుంది.

***

17వ శతాబ్దంనుండే భారతదేశంలో ఆధునికపోకడలు ఆరంభం అయ్యాయని

వెల్చేరు నారాయణరావుగారి మాట. అందుకు ప్రథమసాక్షిగా తంజావూరే నిలబడుతుంది. ఆధునికపోకడల అడుగుజాడల ఆనవాళ్లు తంజావూరు నుండి 

వెలువడిన సాహిత్యంలో దండిగా కనపడతాయి.

***

త్యాగయ్య తెలుగువాడిగా జన్మించటం తెలుగుభాష చేసుకొన్న అదృష్టాలలో ఒకటి.

కర్నాటక సంగీతానికి తెలుగును అధికారభాషగా మార్చినవారు త్యాగయ్య. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంగీతోత్సవాలలో తెలుగు కీర్తనలు వినబడటానికి కారణం త్యాగయ్య. 

అందుకు తెలుగుభాష, తద్వారా తెలుగుజాతి త్యాగయ్యకు ఋణపడ్డాయి.

***

అయ్యవారి కీర్తనలలో మిగతావారి కీర్తనలలో లేని 'హ్యూమన్‌ టచ్‌' ఉంది.

అయ్యవారి కీర్తనలలో గొప్పతనం అదే.

***

తెలుగులో వచ్చిన గొప్ప స్వీయచరిత్రలలో తిరుమల రామచంద్రగారి

“హంపీ నుంచి హరప్పా దాకా” ఒకటి. దానిని స్వీయచరిత్ర అనేకంటే ఒక వ్యక్తి “అనుభవసారం” అనటం మేలు. సాధారణంగా స్వీయచరిత్రలలో “నేను” అనేవాడు విశ్వరూపం ధరించి కనబడతాడు. తన కంటినుండి తను నమ్మినవాటిని మనతో దర్శింపచేయటానికి “నేను” ప్రయత్నిస్తూ ఉంటాడు. రామచంద్రగారి స్వీయచరిత్రలో

“నేను” చాలా ఒబ్బిడిగా తనతోపాటు మనకూ లోకదర్శనం చేయిస్తాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Agarudoopam. అగరుదూపం, Modugula Ravikrishna, 9788198296276, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్