Kitikee Avatala| కిటికీ అవతల
- Author:
- Pages: 260
- Year: December 2024
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹280.00
ఈ రచయిత ఆలోచనా తీరు విభిన్నం, రచనా శైలి విలక్షణం. నూతనవిషయాల అన్వేషణ వారి కథల్లో కనిపిస్తుంది. జీవన నాణ్యత ఆయన ధ్యేయం. - వి. రాజా రామమోహనరావు
ఒక సంఘటన చుట్టూ కథ అల్లుకుపోవటం తేలిక. కానీ, రాను రాను సంక్లిష్టమైపోతున్న మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను కథలుగా మలచటం అంత తేలిక కాదు. పైకి సున్నితంగా కనిపించే సంక్లిష్ట సంబంధాలను కథల్లోకి తీసుకొచ్చి వాటిని పాఠకుల్లోకి ప్రసరింపచేయటమే కథా రచయితలకు నిజమైన సవాలు. ఆ సవాలును స్వీకరించి పాఠకులను మెప్పించగల స్థాయిలో కె.వి. రమణరావుగారు కథలు రాస్తున్నారు. కథను ఎలా ప్రారంభించి, ఎలా ముగించాలో క్షుణ్ణంగా తెలిసిన కథకుడు ఆయన. పద్మవ్యూహంలోకి ప్రవేశించటం, బయటకు రావటం రెండూ తెలిసిన రచయిత ఆయన. – వాసిరెడ్డి నవీన్
రచయితకున్న లోపలి కన్ను, వెలుపలి చూపు, లేత గమనింపు, అన్నిటిని మించి స్పష్టమైన అవగాహన వల్ల వచ్చిన తేటతెల్లమైన వ్యక్తీకరణ వల్ల ఈ కథలు అలజడినీ కలిగిస్తాయి, సాంత్వననూ చేకూరుస్తాయి. – కొప్పర్తి వెంకటరమణమూర్తి
కథలు ఎలా తాత్వికంగానూ కళాత్మకంగానూ తయారవుతాయో వీటిని చదువుతుంటేనే తెలిసిపోతుంది. - రెంటాల శ్రీవేంకటేశ్వరరావు
Tags: Kitikee Avatala, కిటికీ అవతల, డా. కె.వి. రమణరావు, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్