Kalumkoori Gutta - Short Stories | కలుంకూరి గుట్ట - కథలు

Kalumkoori Gutta - Short Stories | కలుంకూరి గుట్ట - కథలు

  • ₹150.00

ఈ కథల్లో ఏదో ఒక రూపంలో ఒక అన్వేషణ కనపడుతుంది. పైకి కనపడే భౌతికమైన వెతుకులాటలో తాత్విక భావన ఏదో తొంగిచూస్తుంది.  'యర్రావు దూడ' ఈ సంపుటికే తలమానికం. దూడ కోసం సాగిన వెతుకులాటలో మనిషికి, జంతువులపట్ల, ప్రకృతిపట్ల సహజంగా ఉండే ఆర్తి మనల్ని కట్టిపడేస్తుంది.  -  - వాసిరెడ్డి నవీన్

కలుంకూరి గుట్ట కథల్లో రచయిత పుట్టిన ఊరు కాలువపల్లి మట్టి వాసనని, కౌడిన్య అడవి అందాల్ని, వూరి జీవనశైలి, స్థితిగతుల్ని దృశ్యీకరించిన విధానం, మంచి శిల్పనైపుణ్యం, శైలితో రాసిన తీరు అభినందనీయం. కథల్లో చిత్తూరు జిల్లా యాస చిరపరిచితమైనదిగా మారి మన జీవితాల్లో మమేకమైపోతుంది. నిజానికి ఈ కథలన్నీ స్థానిక చరిత్రగా చెప్పుకోవచ్చు.     - నరహరిరావు బాపురం

తరానికి ఒకరో ఇద్దురో సాహసంతో మాండలికంలో రాయడం తెలుగు సాహిత్యం చేసుకున్న కొద్దిపాటి అదృష్టం అనుకోవాలి. ఆ తీరున కె.వి. మేఘనాథ్ రెడ్డి మొరుసునాడు (చిత్తూరు) మాండలికంలో రాసిన ఈ 'కలుంకూరి గుట్ట’ కథలు చదువర్లైన మీ గుండెల్ని అబ్బిళించుకుంటాయి.  ఈ రాతరికీ, కతలకీ పేరిమి నెనర్లు. కలుంకూరి గుట్టకి అరిమిలి దండాలు. - సొలోమోన్ విజయ్ కుమార్     

కె.వి. మేఘనాథ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలువపల్లి స్వస్థలమైన కె. వి. మేఘనాథ్ రెడ్డికి రచయితగా ఇది రెండవ పుస్తకం. మొదటిది కవిత్వ పుస్తకం.  మొరుసునాడు నుంచి కొత్తగా వినిపిస్తున్న గొంతు తనది. తమిళనాడు సరిహద్దులోని కుగ్రామమైన కాలువపల్లి నుంచి కథాప్రపంచంలోకి అడుగిడిన మేఘనాథ్ తన ‘సొంత భాష’లోనే రచనలు చేస్తుంటారు. వాసుదేవరెడ్డి, శివేగారి దేవమ్మ చివరి బిడ్డగా 1990లో పుట్టిన ఆయన, వృత్తిరీత్యా పెళ్లిళ్లు వంటి వేడుకల ఆల్బమ్ డిజైనర్. "వృత్తికి ఏమాత్రం సంబంధం లేకపోయినా మా పల్లెటూరి జీవనస్థితిగతులు బతుకుపాఠాలెన్నో నేర్పి నాలోని రచయితను వెలికితీసి పల్లెభాషలో రాయించాయి" అని మేఘనాథ్ చెప్తారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kalumkoori Gutta, K. V. Meghanath Reddy, Astra Publishers, కలుంకూరి గుట్ట, కె.వి. మేఘనాథ్ రెడ్డి, అస్త్ర పబ్లిషర్స్