DECEMBER POOLU - 2025 | డిసెంబర్ పూలు -2025

DECEMBER POOLU - 2025 | డిసెంబర్ పూలు -2025

  • ₹125.00

సంపాదకత్వం: సుజాత వేల్పూరి, బలరామ్

  • "కొందరు వెనక్కి నడుస్తున్నారు. అంతే కాదు, మామూలుగా నడుస్తున్న వాళ్ళని వెక్కిరిస్తున్నారు. వెనక్కి నడవటమే ముందుకెళ్ళడమని వాదిస్తున్నారు.
  • తెల్లచీర సమస్య ఎలా తెగుతుందో శంకరానికి అర్థం కావడం లేదు. ఒక వైపు చెట్టంత మనిషి  పోయిన దుఃఖం. అయినా ఆ దుఃఖాన్ని ఉండుండి తెల్లచీర ఆక్రమించుకుంటోంది.
  • గొప్ప జాతి తెల్ల ఎలుక తన ఎంగిలి బన్ను తినడం చూసి షాక్ తిన్నది నల్ల ఎలుక. నల్ల ఎలుక నోట్లోంచి పడ్డ బన్ను ముక్కనే తను తిన్నానని గ్రహించిన తెల్ల ఎలుక గతుక్కుమంది. ఈ లోపు ఈ దృశ్యాన్ని మూడో ఎలుక... అదే రాజుగారి గూఢచారి ఎలుక చూడనే చూసింది.
  • “చిన్నప్పటి నుంచీ నిత్య దరిద్రాన్నే చూశాము. నా అనుభవంలో దాన్ని మించిన అవమానమూ, చెడూ లేవు. అమ్మా నాన్నా మధ్య ప్రేమ ఎప్పుడు అంతరించిపోయిందో తెలీదు. అందుకే ఎంత కష్టపడి అయినా సరే ఉన్నత ఆర్థిక స్థితికి ఎదగాలని అనుకున్నాను.”
  • బండల మీద ఎర్రటి నెత్తుటిముద్ద. కళ్ళు ఇంకా తెరవలేదు. ఒంటి మీద ఈకలు కూడా లేవు. గూటిలో వెచ్చగా తల్లి రెక్కల చాటున ఒదగాల్సిన ప్రాణం నోరు తెరిచి అల్లాడిపోతుంది. ఈ రోజో రేపో పెంకు పిగలగొట్టుకుని పిల్లలు లోకం చూడాల్సిన రెండు గుడ్లు పిచ్చలు పిచ్చలుగా పగిలిపోయాయి.
  • "ఆ ముసల్దాన్ని ఉంచుకున్నావా?" అని డ్రైవర్లు జోకులు వేస్తే ఇద్దరం పెద్దగా నవ్వేవాళ్ళం. "అదొక్కటే తక్కువ ఇప్పుడు మా ఇద్దరికీ" అనేవాళ్ళం. ఇద్దరమూ దిక్కు లేని పక్షులం. మా ఇద్దరికీ తోడు రాజుగాడే. వాడి తల నిమురుతూ ఉంటే మా ఇద్దరికీ ఏదో తెలియని శాంతి దొరికేది, అది ఇద్దరమూ చెప్పుకోలేదు గానీ.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: DECEMBER POOLU - 2025, డిసెంబర్ పూలు, సంపాదకత్వం: సుజాత వేల్పూరి, బలరామ్, 9789393056689, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ