Bahumukha|బహుముఖ

Bahumukha|బహుముఖ

  • ₹225.00

బహుముఖ  - వి. శాంతి ప్రబోధ కథలు

“వ్యక్తిగత ఎంపికలను గౌరవించడం తెలియని సంస్కృతిలో, సామాజిక, రాజకీయ సంప్రదాయాల్లో ఉన్నాం కదా! సరిహద్దులను నెట్టివేసే, చెరిపివేసే స్త్రీలకు కళంకం అంటకడతారు” అని దీర్ఘంగా నిట్టూర్చింది స్నేహిత.

*****

“సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు మహిళపై విధించిన పరిమితులు బాహ్యంగా కనపడతాయి. పైకి కనిపించని పరిమితులు మహిళలు

తమకు తాము పెట్టుకునేవి. అవే ఆమెను వెనక్కి లాగేది.”

*****

“ఏం తక్కువ చేశాడే నీకు? బంగారంలాంటి బిడ్డల్నిచ్చాడు. మెడ నిండా నగలు దిగేశాడు. కావలసినన్ని చీరలు కొనిచ్చాడు. తరగని ఆస్తి ఇచ్చాడు. ఇప్పుడు అతన్ని వదిలి పోతానంటే సమాజం మొహమ్మీద ఉమ్మేస్తుంది.”

*****

కాలికో చేతికో ముక్కుకో మూతికో దెబ్బ తగిల్తే అయ్యో అంటూ

హడావిడి చేస్తాం. మందూమాకు ఇప్పిస్తాం. కానీ కనిపించని అవయవాలకు తగిలే దెబ్బలని ఎందుకు బయటికి చెప్పుకోవడం లేదు? 

*****

“నా భార్యను నేను మాత్రమే తొలిసారి తాకాలని, చేరువ అవ్వాలని, ఆమెలో నేను మాత్రమే ఉండాలని కోరుకోవడం తప్పెలా అవుతుంది?”

“మరి నువ్వు... నీకు ఆమె మాత్రమే మొదటిది కావాలని 

ఎందుకు అనుకోవు?”

*****

“సాగుతుంటే బానే సాగిచ్చుకుంటారు అత్తగార్లు. ఆ దేశం నుండి

ఈ దేశం వచ్చేటప్పుడు సూటుకేసుల్లో పచ్చళ్ళు, పిండివంటలతో ఇరవైకేజీల లగేజీ తెచ్చినట్టు మూఢనమ్మకాలు, పనికిరాని చెత్తా చెదారం బుర్రలో నింపుకు తెచ్చుకుంటారేమో.”

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Bahumukha, బహుముఖ, వి. శాంతి ప్రబోధ, V. Shanti Prabodha, 9788198296238, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్